– ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ
– కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు పరచడంలో విఫలమైందని విమర్శలు
– ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
– బిఆర్ఎస్ మండల నాయకులు నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు టేకుర్ల సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం వరంగల్ జిల్లా ఎల్కతుర్ధిలో నిర్వహించే రజథోత్సవం భారీ బహిరంగ సభకు హాజరు కావడానికి బయలుదేరారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో కుంభమేళా జరుగుతుందేమో అనే విధంగా ఎటు చూసినా గులాబీమయంతో పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున తరలి వెళ్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు, ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా కెసిఆర్ వజ్రోత్సవ సభలో ఏ విధమైన సందేశం ఇస్తారు అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిపోయినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిస్థాయిలో విఫలమైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నరసింహులు గౌడ్, మోసిన్, మంగలి సాయికుమార్, చుంచు శేఖర్, అల్లం గంగారం, డి.సాయిలు, దొంతి భాస్కర్, తర్నం పోచయ్య,రాజు నాయక్, లక్ష్మణ్ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








