V1News Telangana

best news portal development company in india

విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రఖండ సమావేశం….

SHARE:

– విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల వికాసం కొరకు “క్షేత్ర ప్రశిక్షణ వర్గ”ఉంటుందని సూచనలు

– భవిష్యత్తు కార్యాచరణ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

– హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపు

– నాలుగు జిల్లాల విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రఖండ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాలుగు జిల్లాల విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల వికాసం కొరకు రాబోయే రోజులలో VHP కార్యక్రమాల విషయాల పైన మెరుగైన అవగాహన కొరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా క్షేత్ర ప్రశిక్షణ వర్గ ఉంటుందని తెలిపారు. ఈ విషయం పైన సమావేశం నిర్వహించి బాధ్యత గల ప్రతి ఒక్కరు ప్రశిక్షణ వర్గలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో
కామారెడ్డి జిల్లా కార్యదర్శి బొల్లి రాజు, త్రిఖండ పూర్ణ కాలిక్ వినోద్ కుమార్, నసురుల్లాబాద్ ప్రఖండ అధ్యక్షుడు అరిగె నారాయణ, సత్సంగ ప్రముఖ్ రాఘవ, బజరంగ్ దళ్ నసురుల్లాబాద్, మైలారం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india