– ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి
– ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరాలని ఆకాంక్ష
– ఆర్థిక సహాయం అందడంలో జాప్యం జరగడం పట్ల లబ్ధిదారులకు ఓదార్పు
– ఎవరు అధైర్యపడవద్దు భవిష్యత్తులో అందరికీ లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని హామీ
– వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు , బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసం వద్ద బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ. 37,70,935/- ( ముప్పై ఏడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై అయిదు రూపాయలు ) డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ బిల్లు లను నగదు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని అన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇంటి కల ఉంటుందని అది నెరవేరాలని ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందడంలో జాప్యం జరగడం పట్ల లబ్ధిదారులను ఓదార్చారు. ఎవరు అధైర్యపడవద్దని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యమ రాములు, మాజీ ఎంపీపీ రఘు, యువ నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








