CEIR PORTAL ద్వారా 60 సెల్ ఫోన్ల రికవరీ – నిజామాబాద్ పోలీసుల విశేష సేవ
నిజామాబాద్:
సెల్ ఫోన్ పోయిన బాధితులకు ఊరట కలిగిస్తూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో CEIR PORTAL సాయంతో దాదాపు 60 సెల్ ఫోన్లు రికవరీ చేయబడినట్లు అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్ 26న నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (సి.ఎస్.బి) శ్రీ ఎస్. శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో బాధితులకు వాటిని అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరు తమ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలి. ఫోన్ పోయిన వెంటనే CEIR PORTALలో నమోదు చేయడం వల్ల తక్కువ సమయంలోనే రికవరీ సాధ్యమవుతుంది” అని తెలిపారు. ప్రజలు సెకండ్ హాండ్ మొబైళ్లను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు కొనరాదని సూచించారు.
ఈ ఫోన్ల రికవరీలో కృషి చేసిన మహిళా కానిస్టేబుళ్లు శ్రీమతి డి. అనుష (PC 2704), శ్రీమతి ఆర్. సుష్మ (PC 2312) లను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఇంచార్జి అడ్మిన్ మస్తాన్ అలీ (ఎ.సి.పి – పోలీస్ ట్రైనింగ్ సెంటర్), ఐ.టి కోర్ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సెల్ ఫోన్లు లభ్యమైన బాధితులు తమ ఆనందాన్ని పోలీసు అధికారులతో పంచుకున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








