ఈ రోజు భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, బాసర మండలానికి చెందిన కిర్గుల్ కే గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణ్ రావు పటేల్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా, గ్రామస్తులు మరియు కమిటీ సభ్యులు, గతంలో శ్రీ నారాయణ్ రావు పటేల్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిర్గుల్ గ్రామానికి వేసిన రోడ్డు మినహాయించి, తరువాతి ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేయలేదని తెలియజేశారు. కిర్గుల్ కే నుండి కిర్గుల్ బి వరకు మెటల్ రోడ్డు (మొరము రోడ్డు) మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ అభ్యర్థనపై శ్రీ నారాయణ్ రావు పటేల్ గారు సానుకూలంగా స్పందిస్తూ, రాబోయే రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రయుల పోతన్న గారు, రాజేందర్ గారు, సునీత గారు, అనితా గారు, వెంకట్ రావు గారు మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








