V1News Telangana

best news portal development company in india

భైంసా పట్టణంలో రోడ్లపై చిరు వ్యాపారాలు ముట్టడి – పోలీసులు హెచ్చరిక… రోడ్లపై వ్యాపారాలు వద్దు: భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ సూచన…. . వాహనదారులకు ఇబ్బంది కలిగించే చిరు వ్యాపారాలపై చర్యలు తప్పవు – పోలీసులు…. ప్రమాదకరంగా మారిన రహదారులు: మున్సిపల్-పోలీస్ సంయుక్త చర్యలు…

SHARE:

భైంసా, నిర్మల్ జిల్లా:
ఈ రోజు భైంసా పట్టణంలో మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ విభాగం సంయుక్తంగా రహదారుల పరిశీలన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై చిన్నచిన్న వ్యాపారస్తులు రద్దీ సమయాల్లో వారి వ్యాపారాలను నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు గుర్తించారు. వాహనదారులు ఈ కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో భైంసా పట్టణ సీఐ గోపీనాథ్ చిరు వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడుతూ, రహదారులకు అడ్డంగా వ్యాపారాలు ఏర్పాటు చేయకూడదని, అందుకు ప్రత్యామ్నాయ స్థలాల్లో వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు.

అలాగే, ఎవైనా వ్యాపారులు పోలీసుల సూచనలను లంగిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ మరియు పోలీస్ శాఖలు కలసి మరిన్ని చర్యలు తీసుకుంటాయని అధికారులు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india