V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో ఉగ్రదాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కొవ్వాతుల ర్యాలీ

SHARE:

జమ్మూ కాశ్మీర్‌లోని పవల్ గావ్ ప్రాంతంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ, బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వాతుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు, తదుపరి తిరిగి అంబేద్కర్ చౌరస్తాకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించారు.

ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, సీనియర్ నాయకుడు తోము శరత్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు హిందువులపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాయకులు తలారి నవీన్, దామోదర్ రెడ్డి, ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india