V1News Telangana

best news portal development company in india

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల విద్యార్థులు….

SHARE:

– ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాల ప్రభంజనం

– ఆనందంతో అవధులు లేకుండా పోయిన తల్లిదండ్రుల సంబరాలు

– గ్రామానికి మంచి పేరు సంపాదించినందుకుగాను పలువురు అభినందనలు

– కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు దక్కినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: మంగళవారం రోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నసురుల్లాబాద్ మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన ఉల్లెంగ శరణ్య తండ్రి పేరు పండరి తల్లి పేరు వనజ కష్టపడి చదివి 956/1000 మార్కులు సాధించింది. ఆమె నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అదేవిధంగా నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన మరో విద్యార్థిని మామిడి వరలిక తండ్రి పేరు మక్కయ్య ఇంటర్ మొదటి సంవత్సరంలో 461/470 మార్కులు సాధించింది. ఈ విద్యార్థిని బోర్లం ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం.

మరియు నసురుల్లాబాద్ గ్రామానికి చెందిన గౌడి శ్రీ లక్ష్మీ శ్రేష్ట తండ్రి పేరు నర్సింలు ఇంటర్ మొదటి సంవత్సరంలో 465/470 మార్కులు ఈ విద్యార్థిని నారాయణ కళాశాల బాచుపల్లి హైదరాబాద్ లో విద్యను అభ్యసిస్తుంది.

బొమ్మన్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీజ తండ్రి పేరు గంగాధర్ ఇంటర్ మొదటి సంవత్సరంలో 459/470 మార్కులు సాధించింది.

కృషి పట్టుదలతో చదివి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచి మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు సాధించినందుకు గాను వీరందరికి తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india