V1News Telangana

best news portal development company in india

ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన మట్టిలో మాణిక్యం

SHARE:

బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో మట్టిలో మాణిక్యంలా మెరిశాడు కాదేపురం జీవన్ చంద్ర కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో గల బీర్కూర్ మండలానికి చివరి గ్రామం బరంగ్ ఏడ్గి ఈ గ్రామం కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సరిహద్దు గ్రామం గా ఉంటుంది.. ఈ గ్రామంలో నివాసముండే వ్యవసాయ కూలీలైన కాదేపురం చిన్న గంగాధర్ – అనిత దంపతుల ఏకైక కుమారుడు జీవన్ చంద్ర ఈ విద్యార్థి బీర్కూర్ మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకొని తర్వాత ప్రభుత్వం నిరుపేద దళిత విద్యార్థులకు చేయూతను అందించే “బెస్ట్ అవలేబుల్” పథకంలో భాగంగా నసరుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తాలో గల శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ పాఠశాలలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువును పూర్తి చేశాడు. అనంతరం బీర్కూర్ మండల కేంద్రంలో గల జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతులను అభ్యసించాడు. తదనంతరం బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామ శివారులో గల తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. మంగళవారం రోజు ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో 916/1000 మార్కులను సాధించి, తల్లిదండ్రులకు అదేవిధంగా బరంగ్ ఏడ్గి గ్రామానికి , విద్యను అభ్యసించిన కళాశాలకు వన్నె తెచ్చాడు. ఇలాంటి ఆణిముత్యం మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామస్తులు కోరుతూ అభినందనలు తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india