బోధన్ పట్టణ గ్రంథాలయంలో రీడింగ్ రూమ్ ప్రారంభం – విద్యార్థుల కోసం మౌలిక వసతుల కల్పనకు చర్యలు..
బోధన్: జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు.
మంగళవారం బోధన్ పట్టణ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం గ్రంథాలయాన్ని పరిశీలించారు.
విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
అన్ని గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ బుక్స్, విస్తృత పని సమయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
నిరుద్యోగులు, విద్యార్థులు ఈ సదుపాయాలను వినియోగించుకుని ప్రభుత్వ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
—
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్ దాన్
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో
బోధన్ ఏసీపీ శ్రీనివాస్
తాసిల్దార్ విటల్
పట్టణ సీఐ వెంకటనారాయణ
కాంగ్రెస్ నేతలు: గంగా శంకర్, నాగేశ్వరరావు, తూము శరత్ రెడ్డి, నజీర్ అలీ, ఆనంపల్లి ఎల్లయ్య, దామోదర్ రెడ్డి
యువజన విభాగ అధ్యక్షుడు తలారి నవీన్, చిన్న ప్రమోద్
లైబ్రరీ సిబ్బంది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








