బోధన్: బోధన్ మండలంలోని ఎరాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1992-93 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు సోమవారం తమ క్లాస్ మేట్ చంద్రకాంత్ రెడ్డి నివాసంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ, చదువుకున్న రోజులను, చిలిపి చేష్టలను, ఆనాటి మధుర సందర్భాలను నెమరేసుకుంటూ అందరూ ఆనందంగా గడిపారు. ఉద్యోగాలు, వివాహాల కారణంగా దూర ప్రాంతాలలో స్థిరపడిన వారు కూడా ఈ పునర్మిలనానికి హాజరయ్యారు.
33 ఏళ్ల అనంతరం జరిగిన ఈ పునర్మిలనం అందరిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. సహపంక్తి భోజనాలు, కేక్ కట్ వంటి వేడుకలతో హర్షాతిరేకాల మధ్య మధుర క్షణాలను ఆస్వాదించారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా, ఒకరినొకరు సోదరభావంతో చూసుకుంటూ, సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు సాగాలన్న సంకల్పంతో ఈ సమావేశాన్ని విజయవంతంగా ముగించారు.
ఈ కార్యక్రమంలో 7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








