V1News Telangana

best news portal development company in india

బైంసా ఎడ్ల అంగడిలో నీటి కోసం ఎడ్ల విలాపం!… . నాలుగు కుండీలు… కానీ నీళ్లు లేవు – ఎడ్ల అంగడిలో నిర్వాకం.. . ఎండలు మండుతున్నా… ఎడ్లకు తాగునీరు లభించని అంగడి… . చెత్తతో మునిగిన ఎడ్ల అంగడి – అధికారుల నిర్లక్ష్యం… . ‘నోరు లేని జంతువులు, బాధలెవరికి చెప్పాలి?’ – బైంసాలో గంభీర స్థితి…

SHARE:

బైంసా (నిర్మల్ జిల్లా): బైంసా పట్టణంలోని ఎడ్ల అంగడిలో తాగునీటి కోసం ఎడ్లు వేదన అనుభవిస్తున్నాయి. నాలుగు కుండీలు ఉండగా, రెండు ఖాళీగా ఉన్నాయి, మిగతా రెండింటిలో నీళ్లు ఉండీ ఉండని స్థితిలో ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో ఎడ్లు వచ్చి, కుండీల చుట్టూ తిరిగి నిరాశగా వెనుదిరుగుతున్నాయి.

అంతేకాక, ఆ ప్రాంతం శుభ్రంగా లేక చెత్తాచెదారంతో మునిగిపోయినట్లుగా ఉంది. గేట్లు కూడా పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన మార్కెట్ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ స్వయంగా ఎడ్ల అంగడిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “మంగళవారం మనిషికి ఒక్క గ్లాసు నీళ్లు ఇవ్వకపోతే తప్పు అంటాం, కానీ నోరులేని ఈ జంతువులకు మాత్రం నీళ్లు ఇవ్వకపోతే ఎవరు కరుణిస్తారు?” అని ప్రశ్నిస్తున్నారు.

ఎండలు మండిపోతున్న వేళ, తాగునీరు లేని పరిస్థితి ఎడ్ల జీవితాన్ని నరకంగా మార్చేసింది. “నువ్వు గంట రోజులే నీళ్లు లేకుండా ఉండలేవు, కానీ ఆ ఎడ్లు రోజంతా నీళ్లు తాగకుండా ఎలా బతుకుతాయో?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india