బోధన్: టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమెర్ కార్యకర్తలను కోరారు. బోధన్ పట్టణంలోని అప్నా ఫంక్షన్ హాల్‌లో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో షకీల్ మాట్లాడుతూ, గత ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాల వల్ల ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని, అయితే తాను ఎప్పుడూ ప్రజల పక్షాన ఉన్నానని తెలిపారు.
అలాగే, కొంతమంది యూట్యూబ్ ఛానళ్లూ, పత్రికలూ, ఇతర పార్టీల నాయకులూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఇది రాజకీయ కక్షతో చేస్తుండటాన్ని ఖండించారు. కష్టం మిల్లింగ్ వ్యవహారంలో తనపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు తమ పేరుతో ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులు కక్షపూరిత రాజకీయాలు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నది ఆయన సందేశం.
ఈ సమావేశంలో మాజీ డిసిసిబి డైరెక్టర్ గర్ధావర్ గంగారెడ్డి, ఉద్యమ నాయకుడు జేఏసీ శంకర్, మండలాధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, మరియు అనేక మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








