V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ “రజతోత్సవ భారీ బహిరంగ సభ”ను విజయవంతం చేయాలి…..

SHARE:

– అధిక సంఖ్యలో హాజరుకావాలని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు పిలుపు

– మండల నాయకులు, కార్యకర్తలతో సన్నాక సమావేశం ఏర్పాటు పలు విషయాలపై చర్చ

– “ఛలో వరంగల్” బిఆర్ఎస్ “రజతోత్సవ బహిరంగ సభ” గోడప్రతులు ఆవిష్కరణ

– గులాబీ దండు సత్తా చాటుతామని స్పష్ఠీకరణ

– బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తల తో కలిసి “ఛలో వరంగల్” బిఆర్ఎస్ “రజతోత్సవ బహిరంగ సభ”గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ ఈనెల 27 వ తేదీన వరంగల్ జిల్లా లో నిర్వహించబోయే రజతోత్సవ భారీ బహిరంగ సభకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల నాయకులతో సన్నగా సమావేశం నిర్వహించి పలు విషయాలపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. గులాబీ దండు సత్తా చాటాలని పార్టీ శ్రేణులలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, అఫ్రోజ్, అల్లం రాములు, దేశ్ పాక్ సాయిలు, మోసిన్, మంగలి సాయికుమార్, రమేష్, షఫీ, రాజు, లక్ష్మణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india