– పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం
– జీవన్ రెడ్డిని ప్రజలు ఓటమిపాలు చేసి గుణపాఠం చెప్పారని ఎద్దేవా
– భవిష్యత్తులో నోటి దురుసు మాటలు మాట్లాడితే ఖబర్దార్
– కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శశికాంత్
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ పట్టణంలో భారత్ గార్డెన్ లో.. వరంగల్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల గురించి చేసిన వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అక్కడి ప్రజలు ఛీ కొట్టి ఓటమిపాలు చేస్తే మూడవ స్థానానికి పరిమితమైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మా అభిమాన నాయకుడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం వారి సంస్కారానికి వదిలేస్తున్నామని అన్నారు. ఎవరి స్థానాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మీరు భూ కబ్జాలకు , అవినీతి కార్యకలాపాలకు పాల్పడి మా నాయకుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసే సంకల్పంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. ఆయన అహర్నిశలు ప్రజల అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడే గొప్ప నాయకుడని కొనియాడారు. భవిష్యత్తులో మా నాయకుడిపై నోటి దురుసు మాటలు మాట్లాడితే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఏఎంసి వైస్ చైర్మన్ యమ రాములు, మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సందీప్, లాయక్, ఆవారి గంగారం, రఫీ, రాజు, మన్నాన్, ప్రశాంత్, ఆరిఫ్, అరుణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








