– పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం
– జీవన్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టి ఓటమిపాలు చేశారని ఎద్దేవా
– భూ కబ్జాలు, అవినీతి కార్యకలాపాలు చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు
– నోటి దురుసు మాటలు మాట్లాడితే సహించేది లేదని తరిమికొడతామని హెచ్చరికలు
– మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
– మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మాజీద్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో శుక్రవారం రోజు మాజీ సర్పంచ్ రాము ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గత మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ పట్టణంలో భారత్ గార్డెన్ లో.. వరంగల్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి గోవర్ధన్ మరియు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల గురించి చేసిన వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ సభ్యులు అబ్దుల్ మాజిద్ మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ లో అక్కడి ప్రజలు ఛీ కొట్టి ఓటమిపాలు చేస్తే మూడవ స్థానానికి పరిమితమైన వ్యక్తి మా నాయకుడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు.ఎవరి స్థానాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మీరు భూ కబ్జాలకు , అవినీతి కార్యకలాపాలకు పాల్పడి మా నాయకుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు, ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసే సంకల్పంతో మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. భవిష్యత్తులో మా నాయకుడిపై అవాకులు చెవాకులు వాకులు పేలితే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్ , మాజీ జన్ను బాయ్ ప్రతాప్ సింగ్, మాజీ సర్పంచ్ రాము, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, చుంచు పెద్ద సాయిలు, అంకోల్ సాయన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








