V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో ఫైనాన్స్‌లపై మెరుపు దాడులు – వడ్డీ వ్యాపారస్తుల పరారీ అధిక వడ్డీలకు చెక్ – బోధన్‌లో 8 ఫైనాన్స్‌లపై ఏసీపీ తనిఖీలు . సీపీ సాయి చైతన్య ఆదేశాలపై ఫైనాన్స్‌లపై సుదీర్ఘ దాడులు . నిజామాబాద్ కమిషనరేట్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీస్ సిఖిలు బోధన్ వడ్డీ వ్యాపారస్తులపై దాడులు – ప్రజలకు ఊపిరి

SHARE:

బోధన్ పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ఫైనాన్స్ సంస్థలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎనిమిది ఫైనాన్స్ సంస్థలను తనిఖీ చేశారు. పోలీసులు వచ్చిన సమాచారం మేరకు అనేక ఫైనాన్స్‌లను బంద్ చేసి, వడ్డీ వ్యాపారస్తులు పరారయ్యారు.

ఈ చర్యలు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS ఆదేశాల మేరకు నేడు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఒకేసారి దాడులు జరిగాయి. ప్రజలను అధిక వడ్డీలతో ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడమే ఈ దాడుల ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.

.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india