V1News Telangana

best news portal development company in india

సన్ఫ్లవర్ రైతుల ఆవేదన – కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూపులు.. . ఒకటిన్నర నెలలుగా సన్ఫ్లవర్ కొనుగోలు లేదు – రైతుల పంట తడిసిపోనుంది…. వర్షభావ పరిస్థితుల్లో రైతుల నష్టం – సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం…. . పంట కోతకూ ముందే నష్టం భయం – హున్సా గ్రామ రైతుల దుస్థితి… “బ్రోకర్లకు బానిసలమా?” – న్యాయమైన ధర కోరుతున్న రైతులు…

SHARE:

సాలూర మండలం, నిజామాబాద్ జిల్లా:
హున్సా గ్రామంలో వందల ఎకరాల్లో పండించిన సన్ఫ్లవర్ పంటలు ప్రస్తుతం రైతులకు తలవంచే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. గత ఒకటిన్నర నెలలుగా ధాన్యం కోసి ఉంచినా, ఇప్పటివరకు ప్రభుత్వ సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైతుల చెబుతునట్లు, ప్రతి ఏడాది ఇదే సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. అయితే ఈ సంవత్సరం ఆలస్యమవుతూ, ధాన్యం వర్షాల్లో తడిసిపోవడంతో నష్టం కలుగుతుందన్న ఆందోళన పెరిగింది. వర్షాల కారణంగా ధాన్యం నాశనం అవుతుందన్న భయంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

“ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పలుమార్లు చెప్పినా ఎటువంటి చర్య తీసుకోలేదు. బ్రోకర్లు మాత్రం కిలోకి ₹3500-₹4000 మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తక్కువ ధర కాబట్టి దాదాపు ₹3500 వరకు నష్టపోతున్నాం,” అని రైతులు వాపోతున్నారు.

ఆప్పులు చేసి పంటలు పండించిన రైతులు, ఇప్పుడు పంటను అమ్మలేక అనేకంగా ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకూ కూలీల ఖర్చులు పెరిగిపోతుండగా, అధికారుల నుంచి ఎటువంటి మార్గదర్శకత, సహకారం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు – వెంటనే సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, వారికి న్యాయమైన ధర కల్పించాలని, పంటను కాపాడి ఆదుకోవాలని కోరుతున్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india