గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, రోడ్ల కొరతపై ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులకు గట్టి హెచ్చరికలు చేశారు.మంగళవారం ముధోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులతో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు.
వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. అవసరమైతే బోరు బావులు వేసి ప్రజలకు తాగునీరు అందించాలని అన్నారు.మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉండటాన్ని విమర్శించిన ఆయన, ప్రజలు ఎన్నో రోజులు నీటి కోసం ఎదురుచూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే తానే సెక్రటేరియట్‌కు ఫోన్ చేసి లేదా ముఖ్యమంత్రిని కలిసి సమస్యను పరిష్కరిస్తానని హెచ్చరించారు.
అలాగే, గ్రామీణ రోడ్ల పనులు కూడా వేగంగా ప్రారంభించాలని, ఉపాధిహామీ పథకంలో అందుతున్న నిధులను సద్వినియోగం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్. డి. ఓ. కోమల్ రెడ్డి, డీపీఓ శ్రీనివాస్, ఇ.ఇ. లు సందీప్, రాఘవేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








