V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో అంబేద్కర్ జయంతి ఏర్పాట్లపై మాజీ చెర్మెన్ ఎల్లయ్య ఆగ్రహం… . అంబేద్కర్ విగ్రహం వద్ద అవ్యవస్థితి – మున్సిపల్ కమిషనర్‌పై మండిపడ్డ ఎల్లయ్య.. . ప్రజా ప్రతినిధులకు సమాచారం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎల్లయ్య.. . కలెక్టర్ ఆదేశాల్ని పట్టించుకోని మున్సిపల్ కమిషన్ – మాజీ చెర్మెన్ విమర్శలు.. . అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజకీయ తారసపాటు..

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా:

బోధన్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చెర్మెన్ ఎల్లయ్య పాల్గొని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎల్లయ్య, మున్సిపల్ కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “జిల్లా కలెక్టర్ స్వయంగా జయంతి వేడుకలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినా, బోధన్ మున్సిపల్ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం బాధాకరం,” అని వ్యాఖ్యానించారు.అంబేద్కర్ విగ్రహం వద్ద శుభ్రతా పనులు, వేదిక ఏర్పాటు, ప్రొటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వడం వంటి ప్రాథమిక విషయాలకూడా పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india