V1News Telangana

best news portal development company in india

రామగుండంలో ఆర్వో ప్లాంట్ మరమ్మతు ఆలస్యం పట్టించుకోని అధికారులు ? ఆర్వో ప్లాంట్ మరమ్మతుకు ముహూర్తం ఎన్నడు ?

SHARE:

రామగుండంలో ఆర్వో ప్లాంట్ మరమ్మతు ఆలస్యం పట్టించుకోని అధికారులు ?
ఆర్వో ప్లాంట్ మరమ్మతుకు ముహూర్తం ఎన్నడు ?
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 13:-
రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్‌లోని పీకే రామయ్య కాలనీలో ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో స్థాపించిన ఆర్వో ప్లాంట్, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శిథిలమై, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. స్థానిక కాంగ్రెస్ నేత మడిపెల్లి మల్లేష్ ఫిర్యాదు చేయడంతో, ఎన్టీపీసీ అధికారులు ప్లాంట్‌ను పరిశీలించి, మరమ్మతులకు రూ.7 లక్షలు కేటాయించారు. అయినా, నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జోక్యం చేసుకొని, ఆర్వో ప్లాంట్‌ను త్వరితగతిన మరమ్మతు చేయించి, ప్రజలకు తాగునీరు అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india