V1News Telangana

best news portal development company in india

భైంసాలో డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు – మంత్రి పొంగులేటికి లబ్ధిదారుల ధన్యవాదాలు..

SHARE:

భైంసా, ఏప్రిల్ 12: భైంసా పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి లబ్ధిదారుల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు…

శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గత డిసెంబర్ లో 440 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మిగిలిన మంచినీరు, కరెంట్, సెప్టిక్ ట్యాంక్ వంటి పనుల కోసం సుమారు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అయితే కరెంట్ పనులకు సంబంధించి టెండర్ ఇంకా పూర్తికాలేదని ఇంజనీరింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారని చెప్పారు.

లబ్ధిదారుల కమిటీ సభ్యులు ఈ పనులను వెంటనే ప్రారంభించి ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి, పేదవారికి ఇండ్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భవనాల కోసం పట్టణంలోని రెంట్ ఇండ్లలో ఉన్న పేద కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జే.రాజు, సత్యనారాయణ వకీల్, రామ్ చందర్, నయీమ్, ఇర్ఫాన్, మహేష్ లు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india