V1News Telangana

best news portal development company in india

భైంసా ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం – కల్తీ కల్లు వ్యాపారంపై చర్యలేంటి?… . కల్తీ కల్లు దుకాణాలపై కంప్లైంట్ చేసినా అధికారులు మౌనం!… అధికారుల సహకారంతో కల్తీ కల్లు వ్యాపారం? ప్రజల్లో ఆగ్రహం!… లైసెన్సులేని దుకాణాలకు కళ్లుమూయండి – ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిక.. . చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తాం – స్థానికుల హెచ్చరిక…

SHARE:

భైంసా, ఏప్రిల్ 12:
భైంసాలో కల్తీ కల్లు దుకాణాలపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎక్సైజ్ సీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

స్థానికులు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లు వ్యాపారులతో చేతులు కలిపారని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. సరైన లైసెన్సులు లేని దుకాణాలు నిర్భయంగా పనిచేస్తుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని చెప్పారు.

“ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసి, ఉన్నత స్థాయి విచారణ కోరతాం. అధికారులు గానీ, కల్తీ వ్యాపారులు గానీ తప్పించుకోలేరు” అని మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.

ప్రజలు చేసిన విన్నపం మేరకు సంబంధిత శాఖలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india