V1News Telangana

best news portal development company in india

హనుమాన్ జయంతి శోభాయాత్రకు నిజామాబాద్‌లో భారీ బందోబస్తు 1300 మంది పోలీసుల మోహరింపు – శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

SHARE:

, ఏప్రిల్ 11:నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఏప్రిల్ 12న జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ తెలిపారు.

ఈ సందర్భంగా జరగనున్న శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్‌తో పాటు ఖమ్మం, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది, TSSP బెటాలియన్ బలగాలు కలిపి దాదాపు 1300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

యాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్లు, బైనాక్యూలర్లు సహాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే పాత నేరస్థులపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.

ప్రజలందరూ శోభాయాత్రను స్నేహపూర్వకంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, యాత్రలో పాల్గొనే భక్తులు, నిర్వాహకులు నిబంధనలను గౌరవించాలని ఆయన సూచించారు. ఎలాంటి రూమర్లను నమ్మకండని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ డైవర్షన్లు ఇవే:
శోభాయాత్ర దృష్ట్యా ట్రాఫిక్‌పై కూడా నియంత్రణలు విధించారు.

హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ బస్సులు: RTC బస్ స్టాండ్ – ZP ‘T’ రోడ్ – నిర్మల హృదయ స్కూల్ – అంబేద్కర్ కాలనీ – దుబ్బ రోడ్ – గిరిరాజ్ కాలనీ – బైపాస్ రోడ్ మార్గంలో వెళ్లాలి.

బోధన్ నుండి వచ్చే వాహనాలు: అర్సపల్లి రైల్వే గేట్ – కొత్త కలక్టరేట్ – కాంటేశ్వర్ బైపాస్ – NTR చౌరాస్తా – RTC బస్ స్టాండ్ మార్గాన్ని అనుసరించాలి.

బాన్స్‌వాడ నుండి వచ్చే వాహనాలు: వర్ని చౌరాస్తా – పులాంగ్ సర్కిల్ – కోర్ట్ సర్కిల్ – రైల్వే స్టేషన్ – RTC బస్ స్టాండ్ మార్గంలో వెళ్లాలి.

పోలీస్ కమిషనర్ కార్యాలయ పరిధిలోని అన్ని విభాగాల పోలీసు సిబ్బంది—అదనపు పోలీస్ కమిషనర్లు, ఎ.సి.పిలు, సీఐలు, ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్ సహా స్పెషల్ పార్టీలు విధుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india