V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సమావేశం… శోభాయాత్రకు పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – సీపీ సాయి చైతన్య… . హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారుల సమీక్ష… బోధన్‌లో సీపీ, ఏసీపీ నేతృత్వంలో హనుమాన్ జయంతి….

SHARE:

నిజామాబాద్, బోధన్: హనుమాన్ జయంతి కమిటీ సమావేశం – శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. బోధన్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో పోలీస్ మరియు సివిల్ అధికారులు, హనుమాన్ దీక్ష స్వాములు, మీడియా ప్రతినిధులు, పత్రిక మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు, ఏసీపీ శ్రీనివాస్ గారు, టౌన్ సీఐ మరియు రూరల్ సీఐలు హాజరై పర్యవేక్షణ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించబోయే శోభాయాత్రను శాంతియుతంగా, భద్రతతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు తెలిపారు.
సమావేశంలో మాట్లాడిన సీపీ సాయి చైతన్య గారు, శోభాయాత్ర మార్గాలలో సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను సమీక్షించారు. ప్రజలు శాంతి, సోదరభావంతో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.హనుమాన్ దీక్ష స్వాములు కూడా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల భద్రతకు పోలీసులతో సహకరిస్తామని, శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, మండలాధికారులు కూడా పాలుగొని ప్రజల సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలు సజావుగా సాగాలని ఆకాంక్షించారు.ఈ సమావేశం ద్వారా అధికారులు, స్వాములు, పత్రిక మిత్రులు సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి మార్గం సుగమం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india