V1News Telangana

best news portal development company in india

ప్రమాద రహిత సింగరేణిగా చర్యలు

SHARE:

ప్రమాద రహిత సింగరేణిగా చర్యలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 10:-

రామగుండం రీజియన్‌లోని ఏరియా-1 కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రక్షణ అవగాహన సదస్సులో గనుల్లో సురక్షతపై అధికారులు కీలక సూచనలు చేశారు. డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎన్. నాగేశ్వర రావు, డిప్యూటీ డైరెక్టర్ బానోతు వెంకన్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గనుల్లో తాగునీరు, రెస్ట్ షెల్టర్లు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రూఫ్ ఫాల్ నివారణకు ఆధునిక సాంకేతికత వినియోగించాలని సూచించారు. జీరో హర్మ్, జీరో ఆక్సిడెంట్ లక్ష్యంతో పనిచేయాలని, గత ప్రమాదాల సమీక్షతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. సదస్సులో వివిధ గనుల మేనేజర్లు, సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india