V1News Telangana

best news portal development company in india

48 గంటల్లో బాంబ్ పేలనుందా? కేటీఆర్ హెచ్చరిక!.. . కంచ గచ్చిబౌలి భూముల స్కాంలో బీజేపీ ఎంపీకి లింక్?… “ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్‌!” – కేటీఆర్ కౌంటర్… హెచ్‌సీయూ భూ వివాదం: సుప్రీం సీరియస్, కేసీఆర్‌కి మద్దతుగా కేటీఆర్.. “నాపై వందల కేసులు – అయినా పోరాటం ఆగదు!” – కేటీఆర్ ధీమా… . కాంగ్రెస్ టూల్‌కిట్ బండారం – సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేటీఆర్ ఫైర్

SHARE:

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం పేరిట వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఇందులో బీజేపీకి చెందిన ఎంపీ పాత్ర ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో అన్ని వివరాలు 48 గంటల్లో బయటపెడతామని వెల్లడించారు.
హెచ్‌సీయూ భూ వివాదం, విద్యార్థుల పోరాటం, ప్రభుత్వ స్పందనపై తీవ్రమైన విమర్శలు చేసిన కేటీఆర్, ‘‘ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్‌’’ అంటూ సరదాగా తిప్పికొట్టారు.
సుప్రీంకోర్టు సుమోటో స్పందన, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థుల ఉద్యమం, సాంఘిక మాధ్యమాల్లో కాంగ్రెస్ టూల్‌కిట్ వ్యవహారం, ఇవన్నీ కేటీఆర్ ప్రసంగంలో ప్రాధాన్యం పొందాయి.”నాపై వందల కేసులు పెట్టినా భయపడేది లేదు, పోరాటం ఆపేది లేదు” అంటూ తన ధైర్యాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఫార్మాసిటీలో ఉన్న 14 వేల ఎకరాల్లో పరిశ్రమలు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india