V1News Telangana

best news portal development company in india

కల్తీకల్లు బాధితులను పరామర్శించిన వ్యవసాయ శాఖ సలహాదారులు….

SHARE:

– బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల పరిధిలో చోటు చేసుకున్న సంఘటన

– సంఘటన వివరాలపై ఆరా, మెరుగైన వైద్యం అందించాలని సూచనలు

– బాధితుల సంఖ్య 69కి చేరినట్లు వివరాలు వెల్లడించిన సూపరిండెంట్

– బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశా లు జారీ చేసిన ఎమ్మెల్యే

– పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ , బీర్కూర్ , బాన్సువాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజ్ తో కలిసి పరామర్శించారు. నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురై బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి , ఆసుపత్రి సూపరిండెంట్ DR. విజయలక్ష్మి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల ,బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఎక్సైజ్, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురయ్యారని తెలిపారు.వారిని ఎక్సైజ్, రెవెన్యూ,పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో బాన్సువాడ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారని అన్నారు.ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ DR. విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారని అభినందించారు.
అస్వస్థతకు గురైన దాదాపు 60 మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు, కొంత మంది క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారని తెలిపారు.ఎటువంటి ఒత్తిడులకు లోనవ్వకుండా కల్తీ కల్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india