బోధన్: హనుమాన్ జయంతిని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసిపి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, ఈ నెల 12వ తేదీన సాయంత్రం నిర్వహించనున్న వీర హనుమాన్ విజయయాత్రపై సమీక్షించారు…
ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ, పరిమితికి మించి శబ్దంతో కూడిన డీజేలు వాడకూడదని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో పట్టణ సిఐ వెంకటనారాయణ, రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐలు భాస్కరాచారి, మచ్చందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గుండేడి శంకర్, అర్చకులు ప్రవీణ్ మహారాజ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు కోటేశ్వరరావు, చిన్న హరికృష్ణ, మాలధారణ స్వాములు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








