V1News Telangana

best news portal development company in india

జగిత్యాలలో పొలిటికల్ వార్: జీవన్ రెడ్డి Vs సంజయ్ కుమార్…. కాంగ్రెస్ లో అంతర్గత కలహాలేనా? జగిత్యాలలో వేడెక్కిన రాజకీయాలు.. . “నీవు చేస్తే న్యాయం, మేమైతే?” – సంజయ్ కుమార్ ధ్వజం.. . జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ గరజె – కాంగ్రెస్ లో కొత్త దుమారం.. జగిత్యాల రాజకీయాలు ఉత్కంఠ భరితం – వాడీవేడీ వ్యాఖ్యల పరంపర…

SHARE:

జగిత్యాల జిల్లా రాజకీయాలు హీట్ పిక్కల్లోకి చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జీవన్ రెడ్డి తనకు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తూ సంజయ్ పై సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో అధికారం చలాయించిన సంజయ్, ఇప్పుడు నియోజకవర్గంలో తన దాడిని కొనసాగించేందుకే కాంగ్రెస్‌లోకి వచ్చారని ఆరోపించారు.

దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందిస్తూ, తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డికి అంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో తన చేరికను విమర్శించే జీవన్ రెడ్డి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసే రాజకీయాలు చేశారంటూ ఆరోపించారు.

తాను చేస్తే సరికని పనులు, ఇతరులు చేస్తే తప్పుగా ఎందుకు చూడాలని సంజయ్ ప్రశ్నించారు. కొత్త నాయకత్వానికి అవకాశమివ్వాలని, జీవన్ రెడ్డి చెప్పినట్లుగా ఇవే ఆయన చివరి ఎన్నికలైతే, తరువాత నాయకులకు మార్గం కల్పించాలని సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india