– బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో జరిగిన సంఘటన
– 20 మందికి పైగా అస్వస్థతతో దవాఖాలో చేరిక
– ఐదుగురి పరిస్థితి విషమం
– మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు
– బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కుర్ మరియు నసురుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి పలువురు బాధితులు అస్వస్థ గురై వింత వింతగా ప్రవర్తిస్తున్న సంఘటన బాన్సువాడ నియోజకవర్గంలో కలకలం సృష్టించింది నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ , హాజీపూర్ , దుర్కి గ్రామాలలో, బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో కల్లు దుకాణాలలో కల్లు సేవించిన 20 మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా వారి కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కొరకు నిజామబాద్ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








