V1News Telangana

best news portal development company in india

బిజెపి పార్టీలో చేరిన మైనారిటీ యువకుడు…..

SHARE:

– పార్టీ సిద్ధాంతాలు, అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితుడైనట్లు వెల్లడి

– కండువా కప్పి పార్టీలోకి ఘన స్వాగతం

– మతవిద్వేషాలకు తావివ్వకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి

– నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బస్వాయిపల్లి గ్రామానికి చెందిన మైనారిటీ సోదరుడు సమీర్ సోమవారం రోజు బిజెపి పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో భాగంగా సున్నం సాయిలు పార్టీ కండువా కప్పి అతనికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారు అనుసరించే విధానాలకు ఆకర్షితుడినై బిజెపి పార్టీలో సభ్యుడిగా చేరానని తెలియజేశారు. భవిష్యత్తులో నాలాంటి యువకులు ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అటువంటి వారిని సంఘటితం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, శక్తి కేంద్రం ఇంచార్జ్ గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు కందిపెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, పవన్, రాఘవ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india