V1News Telangana

best news portal development company in india

అనుమతుల్లేని వైద్యం – ధరణి శ్రీ ఆసుపత్రి మోసాలు బహిర్గతం!

SHARE:

నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం:ఇందల్వాయి ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ధరణి శ్రీ ఆసుపత్రి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బేసిక్ స్థాయిలో జనరల్ వైద్యం అందించేందుకు మాత్రమే 2022లో అనుమతులు పొందిన ఈ ఆసుపత్రి, అనధికారికంగా గైనకాలజీ, పిల్లల వైద్యం, జనరల్ సర్జరీ, డిజిటల్ ఎక్సరే వంటి సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది.

ఆరోగ్యశాఖను తప్పుదోవ పట్టించిన ఆసుపత్రి యాజమాన్యం
ఆసుపత్రి మేనేజ్‌మెంట్, ప్రజలకు ‘కార్పొరేట్ స్థాయి వైద్యం’ అందిస్తున్నామంటూ ప్రచారం చేస్తూ, అనుమతులే లేని విభాగాల్లో చికిత్సలు అందించింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ వ్యవహారం పై RTI ద్వారా వెలుగు వచ్చిన సమాచారం ప్రకారం, పైన చెప్పిన విభాగాలన్నిటికీ ఆసుపత్రికి అధికారిక అనుమతులు లేవని జిల్లా వైద్యాధికారి స్పష్టం చేశారు.

డాక్టర్ విష్ణు కుమార్ అబద్ధాల వ్యవహారం
ఈ ఆసుపత్రిలో సేవలందిస్తున్న డాక్టర్ పి. విష్ణు కుమార్, తనను “ఎండి ఫిజీషియన్” అని చెప్పుకుంటూ, నిజానికి ఆయన విద్యార్హత ఎంబిబిఎస్ మాత్రమేనని వైద్య మండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఆయన బోర్డులపై “MD” అని ప్రదర్శిస్తూ, ప్రజలను మోసం చేసిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బోర్డులు తొలగింపు వెనక దాగిన చీకటి నిజాలు
ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించిన బోర్డులను తొలగించడంతో, ప్రజల్లో మరింత సందేహాలు రాజుకుంటున్నాయి. ఒకవైపు అనుమతులున్నాయంటూ డాక్టర్ చెబుతుండగా, మరోవైపు బోర్డులు తొలగించడం వెనుక అసలైన ఉద్దేశం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ప్రజల ఆవేదన – అధికారుల మౌనంపై తీవ్ర ఆగ్రహం
రెండు సంవత్సరాలుగా ఈ మోసపూరిత వైద్యం కొనసాగుతుండగా, సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకొని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india