V1News Telangana

best news portal development company in india

ఇందూర్ హై స్కూల్ విజయం: నవోదయలో ఐదుగురు విద్యార్థులకు ఎంపిక.. . నిజామాబాద్ జిల్లాలో ఇంద్రకీలాద్రిగా ఇదుర్ హైస్కూల్: నవోదయ ఫలితాల్లో గొప్ప విజయం.. నవోదయ రిజల్ట్స్‌లో ఇందూర్ విద్యార్థుల ప్రభావం: ఐదుగురు ఎంపిక….

SHARE:

. ఇందూర్ హై స్కూల్ విజయం: నవోదయలో ఐదుగురు విద్యార్థులకు ఎంపిక..
. నిజామాబాద్ జిల్లాలో ఇంద్రకీలాద్రిగా ఇదుర్ హైస్కూల్: నవోదయ ఫలితాల్లో గొప్ప విజయం..
నవోదయ రిజల్ట్స్‌లో ఇందూర్ విద్యార్థుల ప్రభావం: ఐదుగురు ఎంపిక….

 

 

ఇందూర్ హైస్కూల్ విద్యార్థులకు నవోదయలో ఘన విజయం

నిజామాబాద్ జిల్లాలో జరిగిన జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో 9వ తరగతి ప్రవేశానికి కేవలం 17 సీట్లు ఉండగా, అందులో ఐదు సీట్లు ఇందూర్ హైస్కూల్ విద్యార్థులే దక్కించుకోవడం గర్వకారణంగా ఉంది.

ఈ సందర్భంగా గౌరవనీయ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీ పి. సుధర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపికైన ఐదుగురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతిష్టాత్మకమైన నవోదయ ప్రవేశ పరీక్షలో ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు మెరిట్‌లో ఎంపిక కావడం జిల్లా కోసం గర్వకారణం,” అని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఉన్నత చదువుల ద్వారా మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్‌ శ్రీ కిషోర్ తో మాట్లాడిన శ్రీ సుధర్శన్ రెడ్డి , ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని కొనియాడారు. విద్యారంగంలో ఇంకొంత ముందుకు వెళ్లేందుకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఎంపికైన విద్యార్థుల వివరాలు:

1. జె. వంశిక.2. వై. ఆరుషి.3. రిషునిత.
4. ఆశ్మిత.5. సాత్విక్.

ఈ కార్యక్రమంలో టీచర్లు, పేరెంట్స్, స్కూల్ కరస్పాండెంట్ శ్రీ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india