V1News Telangana

best news portal development company in india

కోటగిరి సొసైటీలో బోనస్ అవినీతి కలకలం – రైతుల ఆగ్రహం ఉప్పొంగుతోంది..సీపీఐ నేతలు రంగంలోకి – ఎమ్మెల్యేపై సూటి ప్రశ్నలు…

SHARE:

కోటగిరి సొసైటీలో బోనస్ అవినీతి కలకలం – రైతుల ఆగ్రహం ఉప్పొంగుతోంది

కోటగిరి, నిజామాబాద్ జిల్లా: కోటగిరి మండలంలోని సహకార సొసైటీలో గత ఖరీఫ్ సీజన్‌లో జరిగిన బోనస్ డబ్బుల అవినీతిపై కలకలం రేగింది. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ నిధులు చైర్మన్, రాజకీయ నాయకులు, రైస్ మిల్లర్ల చేతుల్లో స్వాహా అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ, సీపీఐ పార్టీల నేతలు ప్రెస్ మీట్లు నిర్వహించి తీవ్ర విమర్శలు చేశారు. సహకార సొసైటీ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చైర్మన్ సిద్దుపై భారీ ఆరోపణలు

బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ, సొసైటీ చైర్మన్ సిద్దు బినామీ రైతుల పేర్లను ఉపయోగించి బోనస్ డబ్బులు గర్భగుడిలో పెట్టుకున్నారని ఆరోపించారు. “మూడే ఎకరాల భూమి ఉన్నా, పదిహేను ఎకరాల బోనస్ తీసుకున్నాడు. తన సతీమణి పేరుతో రైస్ మిల్లులో లక్షల రూపాయలు దారితప్పిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది,” అని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో శీను, శ్రావణ్ పేర్లపై కూడా డబ్బులు మాయం చేసినట్లు తెలిపారు.

మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ పై సీరియస్ ఆరోపణలు

మాజీ సర్పంచ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంట్రాక్టర్ అయిన పత్తి లక్ష్మణ్ కూడా బోనస్ డబ్బుల్లో రూ.2.8 లక్షల వరకు మాయ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆయన రైతు కాకపోయినా, పంట పండించకపోయినా, రైతుల పేరిట వచ్చిన బోనస్ నిధులను దుర్వినియోగం చేశారని పలువురు మండిపడ్డారు. పత్తి లక్ష్మణ్ అవినీతికి నంబర్ వన్ స్థానంలో ఉన్నాడని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి ఆయనే సూత్రధారి అని ఆరోపిస్తున్నారు.

సీపీఐ నేతలు రంగంలోకి – ఎమ్మెల్యేపై సూటి ప్రశ్నలు…

సీపీఐ నేతలు దుబాస్ రాము, విటల్ గౌడ్ మాట్లాడుతూ, ఈ అవినీతి వ్యవహారంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులే ప్రధాన పాత్రధారులని తెలిపారు. “బోనస్ రూపంలో సుమారు రూ.50 లక్షల వరకు మాయమైంది. చైర్మన్ సిద్దు, పత్తి లక్ష్మణ్, రైస్ మిల్లర్లే దీనికి కారణం,” అని వారు పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో జరుగుతున్న అవినీతిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారా లేక వారిని కాపాడుతారా అన్నది ప్రజల ప్రశ్నగా మారింది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india