V1News Telangana

best news portal development company in india

కోటగిరి సొసైటీ బోనస్ కుంభకోణం – చర్యలు ఎప్పటికి?

SHARE:

కోటగిరి సొసైటీ బోనస్ కుంభకోణం – చర్యలు ఎప్పటికి?

నిజామాబాద్, కోటగిరి:
కోటగిరి మండలంలోని సహకార సొసైటీలో బోనస్ రూపంలో చోటుచేసుకున్న అవినీతి కేసుపై చర్యలు ఎప్పటికి తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. బోనస్ రూపంలో రైతులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల నిధులు బినామీ పేర్లకు చెల్లింపులు జరిపి, అసలైన రైతులను దోచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి…

ఈ వ్యవహారంలో కోటగిరి సొసైటీ చైర్మన్ సిద్దు ప్రధాన పాత్రధారిగా ఉన్నారని బీజేపీ మరియు సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు తమ ధాన్యం ప్రైవేట్ కొనుగోలు దారులకు విక్రయించినప్పటికీ, బోనస్ డబ్బులు మాత్రం చైర్మన్ తన బినామీల ఖాతాల్లో చొప్పించారు. మూడు ఎకరాల భూమి కలిగిన చైర్మన్ కుటుంబ సభ్యులకు 10-15 ఎకరాల బోనస్ వాల్యూ చెల్లించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమాలకు అడ్డుగోడలుగా నేతలు?

ఈ కేసులో మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మరియు కాంట్రాక్టర్‌గా పేరొందిన వ్యక్తిగా మరో కీలక అవినీతి పాలకుడిగా గుర్తింపు పొందారు. బోనస్ పేరుతో రూ.2.8 లక్షల వరకు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులే ఈ అక్రమాల్లో భాగమవుతుండటంపై ప్రశ్నలు ముదురుతున్నాయి.

దర్యాప్తు ఎప్పటికి?

సొసైటీ స్థాయిలో భారీ అవినీతిని దృష్టిలో ఉంచుకొని, దర్యాప్తును ప్రారంభించాలని ప్రజలు, రైతులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, సీపీఐ నేతలు ధర్నాలు, ప్రెస్ మీట్లు నిర్వహించి, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

మరోసారి తవ్వితే… ఇంకా అవినీతులే

కోటగిరి సహకార సొసైటీలో జరిగిన అవకతవకలు ఐస్ బర్గ్ టిప్ మాత్రమేనని స్థానికులు పేర్కొంటున్నారు. తవ్వితే ఇంకా పెద్ద మొత్తంలో అవినీతి బయటపడే అవకాశముందని అంటున్నారు. రైస్ మిల్లర్‌ల నుంచి మొదలుకొని రాజకీయ నేతల వరకూ ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india