Post Views: 246
ఆర్జీ-1 ఏరియాలో సమీక్షా సమావేశ
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం 
ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో డైరెక్టర్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ కె. వెంకటేశ్వర్లు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎం డి. లలిత్ కుమార్, ప్రాజెక్టు అధికారులతో కలిసి ఉత్పత్తి, రవాణా, సంక్షేమ విషయాలను చర్చించారు. 2025-26 లక్ష్యాలపై దృష్టి సారించి, బొగ్గు రవాణాలో ఆలస్యం లేకుండా చూడాలని, రక్షణ చర్యలతో ఉత్పత్తి చేయాలని సూచించారు. గత ఏడాది 100% ఉత్పత్తి సాధించిన టీమ్‌ను అభినందించి, ఈ ఏడాది కూడా లక్ష్యాలు చేరాలని ఆదేశించారు. సమావేశంలో ఉన్నతాధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








