V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా.. 117వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి – నిజామాబాద్ పోలీసుల ఘన నివాళి.. . సామాజిక న్యాయ యోధుడికి పోలీసుల ఘనాదరణ…

SHARE:

నిజామాబాద్, తేదీ: 05-04-2025:

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారి ఆదేశాల మేరకు, కమిషనరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగగా, అదనపు పోలీస్ కమిషనర్ (ఎ.ఆర్) శ్రీ ఎ. రామచంద్ర రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీసీపీ (ఎ.ఆర్) గారు మాట్లాడుతూ, “బాబు జగ్జీవన్ రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని చంద్వా గ్రామంలో జన్మించారు. బాల్యంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన, జీవితాంతం సామాజిక సమానత్వం కోసం పోరాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాక, పునర్నిర్మాణంలో కూడా తనవంతు పాత్ర పోషించారు,” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సతీష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు తిరుపతి, శ్రీనివాస్, శేఖర్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, సీసీఆర్బీ, ఐటీ కోర్, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కాంప్లైంట్ సెల్, స్పెషల్ పార్టీ, హోం గార్డులు తదితర సిబ్బంది పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india