బోధన్, ఏప్రిల్ 4: బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల లయోలా పాఠశాల యాజమాన్యం శుక్రవారం నాడు హనుమాన్ స్వాములకు, భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించింది.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి గీతాలతో భజనలు చేస్తూ ఆంజనేయ స్వామిని ఆరాధించారు. అనంతరం హనుమాన్ భక్తులందరికీ అన్నప్రసాద బిక్షను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సురేష్, తస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్ మోడల్ పాఠశాలల వ్యవస్థాపకుడు కొడాలి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పాఠశాల సిబ్బంది, స్థానిక హనుమాన్ భక్తులు, స్వాములు పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భాన్ని భక్తులు ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికతతో ఆస్వాదించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








