– కార్యకర్తలకు ఆరోగ్య భద్రత, ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తూ భరోసా
– పలు సందర్భాలలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసి చలించిపోయినట్లు వెల్లడి
– కార్యకర్తలకు, పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ
– భీమా సౌకర్యం కల్పించడం పట్ల సంతృప్తి వ్యక్తం
– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్
– రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ
రుద్రూర్ ప్రతినిధి:
నిజామాబాద్: రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, NRI కోనేరు శశాంక్ పార్టీ కార్యకర్తలకు తన సొంత నిధులతో పోస్టల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆరోగ్య (ప్రమాద) భీమా పాలసీలను రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో అహర్నిశలు పనిచేసే కార్యకర్తలను కాపాడుకోవడానికి.. వారికి, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని తెలిపారు. చాలామంది రాజకీయ నాయకులు కార్యకర్తలను ఎన్నికల సమయాలలో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు తప్ప వారి బాగోగులను పట్టించుకునే వారే కరువయ్యారని పేర్కొన్నారు. చాలా సందర్భాలలో కార్యకర్తలు అంకితభావంతో పనిచేసి ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు చూసి చలించిపోయానని అన్నారు. అలాంటి సందర్భంలోనే నాలో ఈ ఆలోచన కలిగిందని అప్పుడే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఏదైనా చేయాలనే సంకల్పంతో భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నానని.. ఈ విధంగా కార్యకర్తలకు ఆరోగ్య భద్రత, ప్రమాద భీమా కల్పించడం పట్ల చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం మెరుగ్గా ఉందని కార్యకర్తలందరూ సైనికుల్లా చాలా కష్టపడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అమలుపరిచేందుకు సన్నాహాకాలు చేస్తున్నామని తెలియజేశారు. పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని.. పేద ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందంజలో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, అనిల్, పార్వతి మురళి, మండల సీనియర్ నాయకులు రామ్ రాజ్, వినోద్ కుమార్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, వినోద్ కుమార్, కేవిడి సాయిలు, కృష్ణంరాజు, సాయికుమార్, రాజేష్ మరియు సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..