బోధన్ పట్టణంలో “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని బోధన్ నియోజకవర్గం ఇంచార్జీ సత్యనారాయణ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి ఆశయాలను ప్రజలకు గుర్తుచేశారు.
అనంతరం, శ్రమదాన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యాలు వివరించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్ శరత్ రెడ్డి, శ్రీకాంత్ చారి, దాము, వీరభద్రరావు, తలారి నవీన్, గుండెటి రాములు, చిరంజీవి, బద్ధారావు, ధనుంజయ రెడ్డి, సాయిలు, బడుగు, కౌన్సిలర్ డబ్బు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, సమాజ హితం కోసం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు. గ్రామస్తుల నుండి విశేష స్పందన వచ్చినట్లు నేతలు తెలిపారు.
- ఈ కార్యక్రమాన్ని ప్రజలు ప్రశంసించగా, కాంగ్రెస్ నాయకత్వం భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపింది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....