V1News Telangana

best news portal development company in india

హనుమాన్ మాలాధారణ స్వాములకు మండల భిక్ష ఏర్పాటు….

SHARE:

బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గల విట్టలేశ్వర ఆలయంలో బుధవారం రోజు గ్రామానికి చెందిన అంగీర్గ పద్మ,దుబాయ్ విట్టల్ గౌడ్ దంపతుల పెద్ద కుమారుడు అంగీర్గ సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలదారణ స్వాములకు మండల భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం వేకువ జాము నుండి ఆంజనేయ స్వామికి అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.హనుమాన్ మాలదారణ స్వాములు రామనామాన్ని జపిస్తూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమా లను నిర్వహించారు. ఆటపాటలతో , భజన సంకీర్తనలతో భక్తులు మైమరచిపోయి నృత్యం చేస్తూ స్వామివారిని వేడుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భిక్షను స్వికరించారు.భిక్ష అనంతరం స్వాములకు తాంబూలం ప్రధానం చేశారు. మాలాధారణ స్వాములు బిక్ష ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు ఆశీర్వచనం అందించారు. ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని.. ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని వేడుకున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india