భైంసాలో హనుమద్దీక్షా మాలాధారణ మహోత్సవం ఘనంగా ప్రారంభం…
. 41 రోజుల హనుమద్దీక్షా మాలాధారణ భక్తి పరవశ్యంభైసా: అఖిల భారత హనుమద్దీక్షా సేవా సమితి, భైంసా విభాగం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 41 రోజుల మాలాధారణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
ఈ పవిత్ర కార్యక్రమం 02-04-2025 బుధవారం ఉదయం 8:00 గంటలకు భైంసాలోని గణేష్ నగర్, బట్టిగల్లిలో ప్రారంభమైంది. కార్యక్రమంలో నగర సంకీర్తన, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, భక్తులకు మాలాధారణ, భీక్ష (అన్నదానం) మరియు స్వామిజీ వారి ప్రవచనం నిర్వహించబడింది.
భక్తులు, స్వాములు, మరియు విశ్వాసభరిత భక్తజనులు ఈ మహోత్సవంలో పాల్గొని హనుమదాశీర్వాదాలను పొందారు. కార్యక్రమాన్ని అఖిల భారత శ్రీ హనుమద్దీక్షా సేవా సమితి, భైంసా విభాగం విజయవంతంగా నిర్వహించింది.
కార్యక్రమ స్థలం:
నూతన మున్నురుకాపు సంఘ భవనం, బట్టిగల్లి, గణేష్ నగర్, భైంసా (మహిషా)
నిర్వాహకులు:
తుమోల్ల దత్తత్రి (94407 08636) – హనుమద్దీక్షా సేవా సమితి, భైంసా విభాగం.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








