నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో బుధవారం రోజు ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, పిఎసిఎస్ చైర్మన్ హన్మంత్ రావ్, తహసిల్దార్ ఎల్.ప్రవీణ్ కుమార్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ చేతుల మీదుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320 , కామన్ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లబ్ధి పొందాలని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతులకు సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహకంగా క్వింటాల్ కు రూ.500 బోనస్ ను అమలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతరం గ్రామంలో గల చౌక ధరల దుకాణంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందించారు. అన్ని వర్గాల ప్రజలందరికీ నాణ్యమైన , సన్న రకం బియ్యం పంపిణీ చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను కూడా త్వరలోనే విడుదల చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్లు బాల హరిచంద్ర రెడ్డి, మహేందర్ గౌడ్, మేకల ధర్మయ్య, పిఎసిఎస్ సెక్రటరీ నరేందర్, సంతోష్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..