బోధన్: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసి) ఇంచార్జ్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శీల శంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సాలురా మండలం హున్సా గ్రామానికి చెందిన నేతగా, బోధన్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.
రైతుల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని, రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బాధ్యతలు స్వీకారోత్సవంలో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పార్టీ నిమిత్తం శీల శంకర్ అహర్నిశలు శ్రమిస్తున్నందుకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని పిసిసి డెలిగేట్ గంగా శంకర్ అభిప్రాయపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు హాజరై శీల శంకర్‌కు శాలువాలతో సన్మానించారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....