హెచ్‌సీయూ భూములను కాపాడాలని కోరుతూ బిజెపి ప్రజా ప్రతినిధుల బృందం ఢిల్లీ కి వెళ్లారు.. అందులో భాగంగానే ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీకి పయనమాయ్యారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల పచ్చటి అడవి భూమిని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తున్నదని, ఈ భూమిలో అరుదైన రాళ్లు, జింకలు, నెమళ్లు, నక్షత్ర తాబేళ్లు, సరీసృపాలకు ప్రాణాధారమైన చెరువులు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.సుప్రీం కోర్టు తీర్పును, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ చెట్లను, గుట్టలను కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ చర్యలను అడ్డుకోవడానికి తెలంగాణ భవన్ ముందు ఆందోళన చేపడతామన్నారు.అనంతరం కేంద్ర మంత్రులను కలువనున్నట్లు చెప్పారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....