V1News Telangana

best news portal development company in india

అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి….

SHARE:

– విషయ పరిజ్ఞానం లేని వారితో విద్యా బోధన

– అనుభవం ఉన్నవారు, నిపుణులు అని మభ్యపెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం

– చర్యలు తీసుకోని యెడల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరికలు

– (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఉమ్మడి జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్న నీట్,ఎంసెట్,ఎఫ్ సెట్,నవోదయ,సైనిక్ కోచింగ్ సెంటర్ ల పేర్లతో జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రైవెట్ కోచింగ్ సెంటర్లు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఇస్టానుసారంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల పై వెంటనే జిల్లా ఉన్నత అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కొన్ని ప్రైవెట్ కోచింగ్ సెంటర్లు జిల్లా ఉన్నత & జిల్లా విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టల్ వసతి కల్పిస్తామని, విషయ పరిజ్ఞానం లేని వారితో పాఠాలు బోధిస్తూ.. మంచి అనుభవం ఉన్న వారని, నిపుణులని మభ్యపెడుతూ విద్యార్థులను, వారి తల్లి, తండ్రులను అధిక ఫీజులు వసూలు చేస్తూ.. తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరియు ఇంటర్మీడియట్ పూర్తి అయిన కళాశాలల్లోని విద్యార్థులని సర్టిఫికెట్ ల పేరు తో భయబ్రాంతులకు గురిచేస్తూ అదే కళాశాలల్లో ఇస్టానుసారంగా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్న యాజమాన్యలపై సత్వరమే జిల్లా ఉన్నత అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో మా (A.I.S.B) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india