సిఏంఓ గా పదోన్నతి పొందిన ఏరియా హాస్పిటల్ డా.కిరణ్ రాజ్ కుమార్ ని సన్మానించి జిఎం ఉన్నతాధికారులు.
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 01:-
సింగరేణిలోని కీలకమైన పోస్ట్ సిఏంఓ, కార్పొరేట్ మెయిన్ హాస్పిటల్, కొత్తగూడెం పదోన్నతి పొందిన సందర్భంగా డా. కిరణ్ రాజ్ కుమార్ ని జిఎం కార్యాలయం నందు అర్జీ.1 జిఎం శ్రీ డి.లలిత్ కుమార్ గారు మరియు ఏరియా అధికారులు వారిని ఘనంగా శాలువాతో సత్కరించి, వారికి చిరు జ్ఞాపకం అందించడం జరిగింది . సింగరేణిలోనే కీలకమైన చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందడం చాలా గొప్ప అవకాశం అని జిఎం తెలిపారు. అదే విధంగా డి.రమేష్ , మేనేజర్ పదోన్నతి పై వెళుతున్న సందర్భంగా వారిని కూడా సన్మానించి రిలివింగ్ అర్దర్ ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్,పిఓ చంద్ర శేఖర్, డి.జి.ఏం పర్శనల్ కిరణ్ బాబు, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, ఇతర అధికారులు శివ నారాయణ, సాయి ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్, జితేందర్ సింగ్,ధన లక్ష్మి బాయి,రవీందర్ రెడ్డి, బీమా, బ్రహ్మాజీ, వరప్రసాద్, లక్ష్మి రాజం, కుమార స్వామి, శ్రావణ్ కుమార్, హనుమంత రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM