V1News Telangana

best news portal development company in india

మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న బిజెపి నాయకులు….

SHARE:

– రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ఆహ్వానం

– ముస్లిం సోదరుల ఆతిథ్యాన్ని స్వీకరించి, పండగ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

– మనమంతా మనుషులం, మానవత్వమే మన మతం అని పలు సూచనలు

– మత విద్వేషాలకు తావివ్వకుండా, కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా జీవించాలని హితవు

– నసురుల్లాబాద్ బిజెపి మండల అధ్యక్షులు సున్నం సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బస్వాయి పల్లి గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు సమీర్ రంజాన్ పండుగను పురస్కరించుకుని మంగళవారం రోజు ఆహ్వానం మేరకు నసురుల్లాబాద్ మండల బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు మరియు కార్యకర్తలు అందరూ కలిసి హాజరై ఆతిథ్యాన్ని స్వీక రించారు. వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కనీసం లాలాజలం కూడా మింగకుండా భక్తిశ్రద్ధలతో కఠినంగా ఉపవాస ధీక్షలు పాటిస్తూ విశ్వాసం తో అల్లాను ప్రార్థించడం గొప్ప విషయం అని కొనియాడారు. రంజాన్ పండగ సందర్భంగా వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో మతసామరస్యానికి తావివ్వకుండా అన్ని మతాల, వర్గాల ప్రజలు ఐకమత్యంతో, సోదర భావంతో కలిసి, మెలిసి ఉండాలని కోరుకున్నారు. మనమంతా మనుషులం, మానవత్వమే మన మతం అని అన్నారు. ప్రతి మతంలో కొన్ని సుగుణాలు ఉంటాయి, అలాగే నచ్చని అంశాలు కూడా ఉంటాయని మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు ఎక్కడైనా విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. ఆతిథ్యంలో భాగంగా ఒకరికొకరు ఆప్యాయంగా మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన విందును స్వీకరించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ప్రేమగా ఆలింగణం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని .. అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, అరిగె నారాయణ, కంది పెద్ద మల్లేష్, సుంకరి సాయిలు, రాఘవులు, మనూర్ సాయిలు, ధూళి రాజేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india