ఆర్జీ-1 ఏరియా జీ ఏం కార్యలయంలో ధన లక్ష్మి దేవి పూజను నిర్వహించిన జీఎం లలిత్ కుమార్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 01:-
సింగరేణి సంస్థ ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యలయం నందు 2025-26 ఆర్థిక సంవత్సరమును పురస్కరించుకోని ఫైనాన్స్ మరియు ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ధన లక్ష్మి దేవి పూజను శాస్త్రోక్తముగా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జీ-1 ఏరియా జియం డి.లలిత్ కుమార్ హాజరయి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా జియం మాట్లాడుతు 2024-25 ఆర్థిక సంవత్సరమును ముగిసి నూతన ఆర్థిక సంవత్సరము 2025-26 గణాంకాలు ఏప్రిల్ నెలలో మొదలయి మార్చితో ముగుస్తాయని కనుక ప్రతి ఆర్థిక సంవత్సరము మొదటి రోజున ఈ విధంగా లక్ష్మి దేవి పూజ చేయడం అనావాయితిగా లక్ష్మి దేవి కృప కటాక్షాల కొరకు సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకథా పెంపొందించుకొని మంచి లాభాల బాటలో ముందుకెళ్ళాలని ఫైనాన్స్ మరియు ఎకౌంట్స్ విభాగపు అధికారులందరు ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గోని లక్ష్మి దేవి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరము అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం సేఫ్టీ అర్జీ రీజియన్ కె.హెచ్.ఎన్ గుప్తా, క్వాలిటీ జియం అర్జీ రీజియన్ భైధ్య, యస్.ఓ.టు జిఎం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, డిజియం ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి, డిజియం పర్సనల్ కిరణ్ బాబు, అకౌంట్స్ అధికారులు క్రాంతి కుమార్, శ్రీహర్ష, రజిని ఇతర అధికారులు సాయి ప్రసాద్, రవీందర్ రెడ్డి, ఇందురి సత్యనారయణ, బీమా, రాజన్న, హనుమంత రావు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM